రిజిస్ట్రేషన్ లు కష్టమే.. మొరాయిస్తున్న సర్వర్లు !

-

నేటి నుంచి నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. 95 రోజుల తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలల్లో పనులు ప్రారంభం అయ్యాయి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ మొదలు కానుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు స్లాట్ బుకింగ్ కు అవకాశం ఇచ్చారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. ఎల్ ఆర్ఎస్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ల మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపించడం లేదు.

రిజిస్ట్రేషన్లపై అనుమానాలు నివృత్తి చేయడం లేదు. ధరణి వెబ్సైట్ కాకుండా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలి కానీ రిజిస్ట్రేషన్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఇప్పటికీ స్లాట్ బుకింగ్ తెరుచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి క్రయవిక్రయదారులు వెనుదిరుగుతున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సీఎస్ సమావేశం అయ్యారు. పాత పద్ధతిలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయాలని కోర్టు సూచించడంతో తర్జనభర్జన పడుతోంది రిజిస్ట్రేషన్ శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version