తెలంగాణాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్ లు… ఇదే ప్రాసెస్

లాక్ డౌన్ సడలింపు లతో ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం అయ్యాయి అని తెలంగాణా ప్రభుత్వం వెల్లడించింది. భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కార్యకలాపాలు ఉంటాయని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఆన్ లైన్ లో ఈ పాసుల జారీ చేయనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా డాక్యుమెంట్లను ఒక్కసారి మాత్రమే పరిశీలన ఉంటుంది అని అధికారులు స్పష్టం చేసారు. ఇక నిన్న జూన్ 10 వరకు లాక్ డౌన్ ని పెంచుతూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపు ఉంటుంది.