హుజురాబాద్ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం దళిత బందు. అయితే హుజురాబాద్ నియోజక వర్గం లో టీఆర్ ఎస్ ఓడిన తర్వాత దళిత బందు పథకాన్ని అమలు చేయదని పలువురు ప్రతి పక్ష నేతలు ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మత్రం దళిత బందు పథకాన్ని వంద కు వంద శాతం అమలు చేస్తామని అన్నారు. అయితే ఆ హామీ ని నిజం చేస్తు ముఖ్య మంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో దళిత బందు పథకాన్ని అమలు చేయడానికి 4 మండలా ల్లో పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ నాలుగు మండలా ల్లో దళిత బందు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 250 కోట్ల తో ఈ నాలుగు మండలలో దళిత బందు పథకాన్ని అమలు చేయనున్నారు. చింతకాని, తిరుమల గిరి, చారకొండ, నిజాం సాగర్ మండలా లను దళిత బందు పథకానికి పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచు కున్నారు.
ఈ నాలుగు మండలా ల్లో ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్ల ను ఖర్చు చేయనున్నారు. చింత కాని మండలానికి రూ. 100 కోట్లు కేటాయించారు. మిగిలిన మూడు మండలాల కు రూ. 50 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఇప్పటి కే ఈ నాలుగు మండలా ల్లో ఆయా జిల్లా కలెక్టర్లు అర్షులను గుర్తించారు. అంతే కాకుండా వారికి దళిత బందు పథకానికి సంబంధిచి అవగహాన కూడా కల్పిస్తున్నారు.