విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. స్పెషల్ క్లాసుల పేరుతో విధ్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తరువాత వేధింపులు కూడా ఎక్కువ కావడంతో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘన తమిళనాడు లోని కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూర్ కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఆర్ఎస్ పురంలో ఉన్న ప్రైవేటు స్కూల్ లో 12 వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే మిథున్ చక్రవర్తి అనే ఉపాధ్యాయుడి వద్ద స్పెషల్ క్లాసులకు ఎప్రిల్ నుంచి వెళుతోంది. మిథున్ చక్రవర్తి స్పెషల్ క్లాసులతో విద్యార్థిని పిలిపించి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి కారణమైన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది.
గతంలో వేధింపులపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే మిథున్ చక్రవర్తిని వేరే స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితురాలు పలుమార్లు ఫోన్ చేసినా.. స్పందించకపోవడంతో వచ్చిచూడగా .. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా.. తన ఆత్మహత్యకి ఉపాధ్యాయుడితో సహా ముగ్గురు కారణమని.. వారందరిపై చర్యలు తసుకోవాలని బాలిక లేఖరాసి చనిపోయింది. మిథున్ చక్రవర్తి అనే ఉపాథ్యాయుడు తనను లైంగికంగా వేధించాడని.. అతన్ని వదిలిపెట్టొద్దంటూ లేఖలో పేర్కొంది. ఆమె కుటుంబసభ్యులు, సూసైడ్ నోట్ ఆధారంగా కోయంబత్తూరు నగర పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడు మిథున్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, సెక్షన్ 9 (I) రీడ్ విత్ 10, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటన అనంతరం పాఠశాల సహా.. పలుచోట్ల ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మిథున్ చక్రవర్తిని ఉరి తీయాలని స్టూడెంట్స్, సామజిక సంఘాల నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.