రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 30 శాతం ఛార్జీలు తగ్గింపు !

-

ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన రెగ్యులర్ సర్వీసులు త్వరలోనే మొదలు కానుంది నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మూడు నెలల పాటు దేశానికి తాళం పడిన సంగతి తెలిసిందే. దీని కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేసింది రైల్వే శాఖ.

లాంగ్ ఫోన్ ఎత్తి వేసిన తర్వాత… రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. అయితే రెగ్యులర్ రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. టికెట్ ధర పై 30 శాతం అధిక ధరతో వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తూ వచ్చింది రైల్వే శాఖ. కరోనా కు ముందు దేశవ్యాప్తంగా నిత్యం 1700 మెయిల్ ఎక్స్ ప్రెస్ లు, ముప్పై ఐదు వందల ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కరోనా ఆంక్షల కారణంగా ఆ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక రైళ్లలో 95% మెయిల్ రైళ్లు అందుబాటులో ఉండగా 25% రైలు ఇతర కేటగిరీల లో సేవలను అందిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను కేవలం వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి. 70% ప్యాసింజర్ రైలు ఎక్స్ప్రెస్ హోదా ఇచ్చి అదే స్థాయిలో టికెట్ ధరను కూడా వసూలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆదేశాలు రద్దు చేయడంతో పాటు రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టంచేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. దీంతో ప్రయాణీకులకు ఊరట కలుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news