నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నార్తర్న్‌ రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Indian-Railways

న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులకి ఎవరు అర్హులు..? వయస్సు ఎంతుండాలి..? అనే వివరాలని చూస్తే.. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌ బాల్, చెస్‌ వంటి క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.

అదే విధంగా ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే ఇంటర్మీడియట్‌/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఒలింపిక్స్‌/వరల్డ్‌కప్‌/వరల్డ్‌ చాంపియన్‌షిప్‌/చాంఫియన్స్‌ ట్రోఫీ/కామన్‌వెల్త్‌ చాంపియన్‌ షిప్స్‌/యూనివర్శిటీ గేమ్స్‌ లో పాల్గొని ఉండాలి.

వయస్సు అయితే 01-01-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గేమ్‌ స్కిల్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఫీల్డ్‌ ట్రయల్స్‌తో పాటు సంబంధిత క్రీడలో సాధించిన విజయాలు, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అప్లై చెయ్యడానికి 27-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version