జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం కింద డబ్బులను ఏపీ సర్కార్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను సీఎం వైయస్.జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఈ పథకం వల్ల అక్షరాల 11.03 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోందని.. మూడో త్రైమాసికం పూర్తయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చ్తేన్నామన్నారు. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ గొప్పగా అమలవుతోందని… పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకాకూడదని తెలిపారు.
ఈ ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించామని.. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి 15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి 20వేల రూపాయలు ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఇప్పటివరకూ రూ.2267 కోట్ల రూపాయలు ఇచ్చామని… మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నామని వెల్లడించారు.