జియో యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. ఈ కొత్త ఫీచ‌ర్‌తో నెట్‌వర్క్ లేకపోయినా కాల్ చేయొచ్చు..

-

ప్రస్తుతం టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 4జీ స్థానాన్ని త్వరలో 5జీ చేయనుంది. అయితే అంతకుముందే కాలింగ్ విషయంలో ఓ అసాధారణ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అదే VoWiFi ఫీచర్‌. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కలిగే ప్రధాన లాభం ఏంటంటే.. కొంతమంది ఇళ్లలో నెట్ వర్క్ సరిగ్గా పనిచేయదు. వారు కాల్స్ మాట్లాడలంటే తప్పనిసరిగా ఇంటి బయటకు వచ్చో, లేకపోతే మేడ మీదకు వెళ్లో ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే.. మీ ఇంట్లో సిగ్నల్ లేకపోయినా వైఫైకు కనెక్ట్ చేసుకుంటే చాలు.. మరింత స్పష్టంగా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు.

ప్రస్తుతం రిలయెన్స్ జియో ఈ ఫీచర్‌ను మహారాష్ట్రలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు. VoWiFi ఫీచర్ స్మార్ట్‌ఫోన్లల్లో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌ మారిస్తే చాలు. సెట్టింగ్స్‌లో వైఫై కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ లేకుండా ఫోన్ కాల్స్ చేయొచ్చు.ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న VoWiFi ఫీచర్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే జియో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. రిలయెన్స్ జియోతో పాట ఎయిర్ టెల్ కూడా ఈ ఫీచ‌ర్‌ను అందిస్తుండటం విశేషం. కానీ ప్రస్తుతానికి అయితే ఈ రెండు నెట్ వర్క్ లూ దీని కోసం అదనంగా ఎటువంటి రుసుమునూ వసూలు చేయడం లేదు. కాబట్టి వినియోగదారులు ఈ వైఫై కాలింగ్ సేవలను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news