నన్నారి షర్బత్‌తో వేడి నుంచి ఉపశమనం.. తయారీ విధానం తెలుసుకోండిలా..!

-

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి కాలు బయటకు తీయాలంటే వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి, శరీరానికి చల్లబరుచుకునేందుకు ఇళ్లలో జ్యూసులు తయారు చేసుకుంటారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ కంటే సహజమైన డ్రింక్ ఆరోగ్యానికి మంచి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సహజమైన డ్రింకుల్లో నన్నారి షర్బత్ కూడా ఒకటి. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఈ సుగంధి షోడా ఎంతో ఉపయోగపడుతుంది.

nannari_root_powder

రాయలసీమలో మాత్రమే దొరికే ఈ నన్నారి షర్బత్‌కు 40 ఏళ్ల చరిత్ర ఉంది. రాయలసీమలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి స్థానికులు ఒక రకమైన చెట్టు వేరుతో నన్నారి షర్బత్‌ను తయారు చేస్తారు. ముఖ్యంగా కడప జిల్లాలో నన్నారి షర్బత్‌ ఫేమస్. ఈ షర్బత్‌లో శబ్జాగింజలు నానబెట్టి కలిపి తాగితే శరీరం తొందరగా చల్లబడుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఎంత ఎండలో తిరిగి వచ్చినా నన్నారి షర్బత్ తాగినప్పుడు శరీరం చల్లబడుతుందని, నన్నారి లేని సోడా బంకులు, కూల్‌డ్రింక్ షాపులు ఉండవని వారు పేర్కొన్నారు. వేసవి కాలంలో రాయలసీమలో ప్రతిచోట ఈ షర్బత్ కనిపిస్తుంది.

సుగంధిపాల చెట్టు వేర్లతో సన్నారి షర్బత్‌ను తయారు చేస్తారు. ఈ చెట్టు వేర్లు తీగలాగా పాకి భూమిలోకి వెళతాయి. ఈ వేర్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని ఆయుర్వేదం చెబుతోంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో పండ్లు, చెట్ల వేర్లు కూడా ఉపయోగపడుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సుగంధిపాల చెట్ల వేర్లని తీసుకొచ్చి ఎండలో నానబెట్టుకుంటారు. బాగా ఎండిన వేరును వేడి నీటిలో వేసి మరిగిస్తారు. కొద్ది సేపటి తర్వాత పంచదార కలిపి నన్నారి సిరప్‌ను తయారు చేస్తారు. ఒక గ్లాసులో కొద్దిగా నన్నారిని పోసి అందులో కొంచెం నిమ్మకాయం రసం, సోడా పోసి తాగుతుంటారు. దీనిని నన్నారి షర్బత్ అంటారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు నన్నారి షర్బత్ మంచి ఔషధంగా పని చేస్తుందని రాయలసీమ ప్రజలు భావిస్తుంటారు. అయితే ఈ షర్బత్ మొదట్లో కడప జిల్లాలోనే దొరికేది. కాలక్రమేనా అన్ని జిల్లాలకు వ్యాపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version