రజనీకాంత్ బాషా సినిమా రీమేక్.. హీరో ఆయనే.!

-

తెలుగు ప్రేక్షకులకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రజనీకాంత్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్ , మేనరిజం, నడక వీటన్నింటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలలో బాషా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రజినీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

అప్పట్లోనే తెలుగు , తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత చాలామంది రజినీకాంత్ ను బాషా అంటూ ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వేస్తే చాలా ఇంట్రెస్ట్ గా చూసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు . అయితే సూపర్ స్టార్ అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్తను చెప్పాలి. ఈ బాషా సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్డారు కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్.

అయితే ఈ వార్త అభిమానులకు శుభవార్త అయినప్పటికీ కూడా మరో నిరాశపరిచే వార్త కూడా మన ముందుకు వచ్చింది. అదేమిటంటే బాషా సినిమా రీమిక్స్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించడం లేదట. డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాను హీరో అజిత్ తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news