వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే ఇబ్బందుల నుండి దూరం అవడానికి పాటించాల్సిన చిట్కాలు..

-

కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైపోయింది. సంవత్సర కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో తెలియదు. ఇప్పుడప్పుడే కరోనా తగ్గేలా లేదు కాబట్టి మరిన్ని రోజులు ఇదే కొనసాగుతూ ఉండవచ్చు. ఐతే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు బాగానే ఉన్నప్పటికీ దానివల్ల చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల మానసిక సమస్యలు అధికం అవుతున్నాయి. ఇంకా ఒకే చోట కూర్చోవడం వల్ల మెడ, నడుము, నరాలకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే ఇబ్బందుల నుండి దూరం చేసుకోవడానికి కావాల్సిన చిట్కాలు.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్య.. బరువు పెరగడం. ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏది పడితే అది తింటుంటారు. తినడానికి సరైన టైమ్ ఉండకపోవడం వల్ల అమాంతం బరువు పెరిగిపోతారు. బరువు పెరగకుండా ఉండేందుకు వ్యాయామం చేయడం ఉత్తమం. రోజూ పొద్దున్న కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయడం ఉత్తమం. మానసిక సమస్యలు దూరం కావడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది.

కండరాలు, వెన్నునొప్పి

ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. ఐతే మీరు కూర్చుక్=నే భంగిమ సరిగా ఉండేలా చూసుకోండి. వెన్నుపూసను వంచుతూ కూర్చోకండి. నిటారుగా ఉండేలా చూసుకోండి. ఇంకా ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి కూర్చున్న చోటు నుండి లేచి అటూ ఇటూ ఓ రెండు నిమిషాల పాటు నడవండి.

కంఫ్యూటర్ సిండ్రోమ్

ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కళ్ళమీద ప్రభావం పడుతుంది. కంప్యూటర్ తెర నుండి వచ్చే నీలికాంతి కళ్ళకి హాని కలిగిస్తుంది. అందుకే కళ్ళకి సంబంధించిన వ్యాయామాలు చేయండి. ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి కంప్యూటర్ ముందు నుండి తప్పుకుని ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువుని చూస్తూ ఇరవై సెకన్ల పాటు రెప్పలు అల్లార్చండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version