మనమందరినీ నమ్మకూడదు. స్నేహితుడిగా మార్చుకోవాలి అనుకునే ముందు కచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మీరు స్నేహితులని చేసుకోండి. ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే ఈ విషయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అని ఆచార చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. ఒకవేళ కనుక మీరు వీటిని అనుసరించకుండా ఎవరితోనైనా స్నేహం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి స్నేహం చేసేటప్పుడు ఎటువంటి విషయాలని గుర్తు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అర్థం చేసుకోండి:
చాణక్య నీతి ప్రకారం మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని వ్యక్తితో స్నేహం చేయకూడదట మంచి స్నేహితులు అయితే మీ భావాలని అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేది కూడా వింటారు.
గుడ్డిగా నమ్మకండి:
ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే నమ్మకం చాలా అవసరం. గుడ్డిగా మాత్రం నమ్మేశారు అంటే మీరే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
తప్పుడు పనులకి సహకరించకండి:
తప్పు చేసే పనులకి సహకరించకూడదు. మంచి స్నేహితులు ఎప్పుడూ కూడా తప్పు చేయొద్దని చెప్తారు. అలానే సహాయం అడగరు.
ఇబ్బంది పడినప్పుడు సాయం చేయడం:
మంచి స్నేహితులు ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేస్తారు అది కూడా మీరు అడగకుండానే. కాబట్టి కచ్చితంగా వీటిని మీరు స్నేహం చేసే ముందు చూసుకుని అప్పుడు మాత్రమే స్నేహం చేయండి లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది.