ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుక చౌదరి అమరావతి గురించి మాట్లాడడమేంటి – కొడాలి నాని

-

ఇటీవల అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం రోజు తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ఆ పాదయాత్రలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని , రేణుక చౌదరి పై మండిపడ్డారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుక చౌదరి అమరావతి గురించి మాట్లాడటమా? అని నిలదీశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అన్నారు.

ఒక కులం కోసమో, మతం కోసమో వికేంద్రీకరణ చేయడం లేదని చెప్పారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లందరూ జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. అమరావతిలో టిడిపి నేతలు అందరికీ భూములు ఉన్నాయని చెప్పారు. సినీ ప్రముఖులు అశ్విని దత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు అమరావతిలో కోరుకున్నచోట భూములు ఇచ్చారని ఆరోపించారు. టిడిపి నేతలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని, స్వార్థ ప్రయోజనాలే వారికి ముఖ్యమని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news