ఉద్యమాల పట్ల అణచివేత ధోరణి తగదు – సోము వీర్రాజు

-

ఉధ్యమాల పట్ల అణచివేత దోరిణి తగదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఉధ్యమాలు ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునిరావడంలో ప్రజాస్వామ్యంలో ఒక భాగం అన్నవిషయ ప్రభుత్వం గ్రహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హితవు పలికారు. అంగన్వాడీల న్యాయమైన కొర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అంగన్వాడీ వర్కర్ల ఉధ్యమం పై అణచివేత దోరిణి తగదన్నారు.

తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామి నీటిమీద వ్రాతగా మిగలడంతోనే తమ సమస్యను పరిష్కారంకోసం ఉధ్యమం చేశారని అయితే ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా వ్యవహరించడం లేదన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యూటి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలని కోరినా రాష్ట్రప్రభుత్వం స్పందించడంలేదన్నారు. సమస్యలను పరిష్కారం చెయ్యాలని ప్రాజెక్టు, జిల్లాలలో అంగన్వాడీలు ఆందోళన చేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రాలేదు కాబట్టే రాష్ట్రవ్యాప్త ఉధ్యమానికి వారు సిద్దపడ్డారు. సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి, వంట గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి, 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలన్న వారి న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలన్నారు. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి. 300 జనాబా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి, మినీ సెంటర్లోని వర్కర్లను మెయిన్ వర్కర్లుగా తీసుకోవాలి, అదనంగా హెల్పర్లని నియమించాలి.అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు వర్తింప చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ లతో వారు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకుని వస్తే వారి పై కొరడా ఝుళిపించి ఉధ్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న అహాన్ని ప్రభుత్వం ప్రదర్శించడం దుర్మార్గపు చర్యగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అభివర్ణించారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news