ఉగాది పండుగని జరుపుకోవడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా..?

-

ఉగాది రోజు సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పబడింది. ఉగాది లో యుగ అనగా నక్షత్ర గమనం- జన్మ – ఆయుష్షు అని అర్థాలు. అది అంటే మొదలు. ఉగాది అంటే ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఉగాదిని మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరి కొన్ని చోట్ల కూడా చేసుకుంటూ వుంటారు. ఉగాది రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, గోపూజ వంటి ఆచారాలని ప్రజలు పాటిస్తారు.

 

ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఉగాది పచ్చడిని ఎంతో రుచిగా తయారు చేసుకుంటారు. అయితే ఈ రోజు ఉగాది పండుగను జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణాలు చూద్దాం. ఉగాది నాడు పంచంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. పంచాంగం ప్రకారం ద్వారా ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఎదురవ్వనున్నాయి అనేది తెలుసుకుంటారు.

అలానే పంటల గురించి కూడా తెలుసుకుంటారు. రాశుల వారిగా వారి ఆదాయ వ్యయాలను తెలుసుకుంటారు. గ్రహాల స్థితి గతుల తెలుసుకుని దోషాలు ఏమైనా ఉన్నట్టయితే శాంతి పూజలు, నివారణ కోసం పూజలను చేసుకుంటారు. ఈసారి మనం ‘శుభకృతు’ నామ సంవత్సరంలోకి రాబోతున్నాం. అయితే ఇక ఉగాది పండుగను జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణాలు చూసేద్దాం.

చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజునే బ్రహ్మ దేవుడు ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించాడు అని పురాణాల ప్రకారం తెలుస్తోంది. అయితే వేదాలని హరించిన సోమకుడిని శ్రీ మహా విష్ణువు మత్స్యవతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు. ఆ వేదాలను బ్రహ్మకి ఇస్తాడు. దీనితో ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పురాణాల్లో చెప్పబడింది. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే వసంత రుతువు కూడా మొదలవుతుంది. అందుకే అసలు ఈ ఉగాది పండుగ వచ్చింది. ఈ కారణంగానే మనం తరతరాల నుండి కూడా ఉగాదిని జరుపుకుంటున్నాము.

 

 

Read more RELATED
Recommended to you

Latest news