Republic Review: మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సెన్సెషల్ డైరెక్టర్ దేవ్ కట్టాల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, పుల్లారావు లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సాయితేజ్ కు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పొలిటికల్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లూక్, మూవీ ట్రైలర్ లకు అనూష్య స్పందన వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో మిలియన్ వ్యూస్ సాధించి.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ సంచలన వ్యాక్యలుచేయడంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి ‘రిపబ్లిక్’ చిత్రంపై పడింది.
ఇక కథ విషయానికి వస్తే.. తెల్లేరు సరస్సు కబ్జా కథాంశం. ఈ సరస్సును మూప్పై ఏండ్లలో నామారూపాలు లేకుండా కబ్జాలకు గురి అవుతుంది. ఈ సరస్సును ఆక్రమించే క్రమంలో చేపలకు విషాహారాన్ని మేతగా వేస్తారు. దీంతో అది ఆ ప్రాంత వాసుల ప్రాణాలకు ముప్పుగా ఏర్పడుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది. తన కొడుకును సీఎం కూర్చీలో కూర్చోపెడుతుంది.
ఈ క్రమంలో ప్రజా సంక్షేమానికి కట్టుబడాల్సిన ప్రభుత్వాలను నిలదీసే ఐఏఎస్ అధికారి పంజా అభిరామ్ (సాయి తేజ్). ఆయన తెల్లేరు ప్రాంత కలెక్టర్ గా వస్తాడు. ఈ క్రమంలో విశాఖ వాణికి ఎలా బుద్ధి చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అన్నదే సినిమా కథ. పైకి ఇది మంచినీటి సరస్సుకు సంబంధించిన సమస్యగా కనిపించినా ఇందులో అవినీతిమయమైన ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నించేలా తెరకెక్కించినా చిత్రం రిపబ్లిక్.
అభిరామ్ తండ్రి దశరథ్ (జగపతిబాబు). ఆయన ఓ ప్రభుత్వ అధికారి. తొలుత మంచి అధికారిగా ఉన్న ఆయన ఎందుకు అవినీతి పరుడుగా మారాడో చూపించాడు. ఈ చిత్ర కథానాయకి మైరా (ఐశ్వర్యా రాజేశ్). ఆమె కనిపించని అన్నయ్యను వెత్తుకుంటూ విదేశాల నుండి వచ్చిన యువతిగా కనిపిస్తుంది. ఈ సమయంలో.. ఆమె ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆమె తన అన్నను ఎలా కలుసుకుంటుంది. ఈ క్రమంలో .. మన రాజకీయ, పోలీసు, న్యాయ శాఖల్లోని లోటుపాట్లను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు దేవ్ కట్టా.
అలాగే.. ఈ చిత్రంలో కీలక పాత్ర విశాఖ వాణి( రమ్యకృష్ణ) .. తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ నేత. పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటాడు . ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేశాడు. ఈ క్రమంలో ఎలాంటి పదవులను చేపట్టాడు. కానీ ఆయన ఉన్నత పదవిని అధిష్టించాలనే ఆశ ఆశగానే మిగిలిపోతుంది.
ఈ క్రమంలో విశాఖ వాణి తన తండ్రి సాధించలేనిది ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో అడ్డదారులు తొక్కుతూ అధికార పగ్గాలను చేజిక్కిచుకుంటుంది. తన కొడుకును సీఎం కూర్చీలో కూర్చోబెడుతుంది.
విశాఖ వాణి పాత్ర ద్వారా సమాజంలో లోటుపాట్లను, ప్రభుత్వ అధికారులపై రాజకీయ నాయకులు
ఏవిధంగా జూలుం చేస్తున్నారో చూపించారు దేవ్ కట్టా. అలాగే..పంజా అభిరామ్ అనే కలెక్టర్ ను ఎక్స్ పెర్మెంట్ గా అందుకు వాడుకోవడం బాగుంది.
ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ, న్యాయస్థానాలు… ఒక దాన్ని మరొకటి డామినేట్ చేస్తున్నాయో.. ఇందులో ఏ ఒక్కటి మరో దానికి కొమ్ముకాస్తున్నాయో.. ప్రలోభాల కారణంగా లొంగిపోయినా ప్రజాస్వామ్యం అపహాస్యమౌతుందో ఈ సినిమా ద్వారా దేవ్ కట్టా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం కమర్షియల్ గా ఏ మేరకు విజయం సాధిస్తుందనేది పక్కన పెడితే.. భ్రష్టుపట్టిన వ్యవస్థల్లో మార్పు రావాలనే ఆలోచనను పూరిగొల్పే ప్రయత్నంలో డైరెక్టర్ దేవ్ కట్టా మాత్రం సక్సెస్ అయ్యాడు
ఇక నటీనటుల విషయానికి వస్తే… పంజా అభిరామ్ పాత్రకు సాయితేజ్ వందశాతం న్యాయం చేశాడు. అభిరామ్ పాత్రలో లీనమయ్యాడు. ఆ పాత్రకు జీవం పోశాడు. ఎప్పటిలానే జగపతి బాబు తన పాత్రకు పూర్తిస్తాయిలో న్యాయం చేశాడు. జగపతిబాబు అవినీతి ప్రభుత్వ అధికారిగా కనిపించి మెప్పించాడు. లీడ్ రోడ్ లో రమ్యకృష్ణ నటించి, మెప్పించింది.
కరడుకట్టిన పొలిటికల్ లీడర్ గానే కాకుండా క్లయిమాక్స్ లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెలిబుచ్చిన ఆవేదన హృదయానికి హత్తుకుంటుంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ .. ఎన్.ఆర్.ఐ. మహిళ మైరా పాత్రకు చాలా బాగా సెట్ అయ్యింది. ఆమని, చేతన ,సుబ్బరాజు ,శ్రీకాంత్ అయ్యంగార్ ,మనోజ్ నందన్ ఆయా పాత్రలలో నటించి మెప్పించారు.
ఇక డైరెక్టర్ దేవ్ కట్టా విషయానికి వస్తే.. కథ, మాటల్లో తనదైన పంచ్ మార్క్‌ను చూపించాడు. కథను పేపర్ మీద రాసుకోవడమే కాదు.. తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.
మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో అట్రాక్షన్. సుద్దాల అశోక్ తేజ్ అందించిన సాహిత్యం అదుర్స్ . ఇక ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ కేక. కె. రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్. పొలికట్ డ్రామాను కమర్షియల్ సినిమాగా మార్చడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి చిత్ర యూనిట్. మెగా అభిమానులకు ఈ చిత్రం పండుగ వాతావరణాన్ని ముందే తెచ్చిందని చెప్పాలి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ మూవీ రిపబ్లిక్.
సినిమా : రిపబ్లిక్
దర్శకుడు: దేవ కట్టా
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు
నిర్మాణ సంస్థ: జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్
సంగీత దర్శకుడు: మణి శర్మ
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, రమ్య కృష్ణన్, జగపతి బాబు
విడుదల తేదీ: 1 అక్టోబర్ 2021
రేటింగ్: 2.75/5