గులాబ్ తుఫాను ధాటికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. మరోవైపు వరద తీవ్రతతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తి వేయడంతో మూసీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం జహంగీర్ అనే కార్పెంటర్ మూసీలో పడి గల్లంతు అయ్యారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన జహంగీర్ను కాపాడలేక పోయారు. తర్వాత ఇదే రకంగా మూసీ వరదలో మరో ఇద్దరు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ గా పనచేసే శ్రీనివాస్ అనే వ్యక్తిమూసీలో పడి గల్లంతు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత శుక్రవారం నాలాలో పడి రజనీకాంత్ అనే యువకుడు చనిపోవడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. నాలాలో పడి ఇప్పటికే రజనీకాంత్ తో పాటు మరో వ్యక్తి మరణించారు.