కవిటిలో కిడ్ని వ్యాధులపై పరిశోధనలు

అమ‌రావ‌తి(శ్రీకాకుళం): కవిటి మండలంలో కిడ్నీ వ్యాధి స్థితిగతులపై న్యూఢిల్లీకి చెందిన ఐసీఎంఆర్‌ బృందం పరిశోధనలు ప్రారంభించారు. ఐసీఎంఆర్‌ నెఫ్రాలజీ ఈడీ డాక్టర్‌ వివేకానంద ఝా నేతృత్వంలో కవిటి, కపాసుకుద్ది గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ఇంటింటా తిరిగి వ్యాధిగ్రస్థుల రక్త నమూనాలను సేకరించారు. రోగులతో మమేకమై వారి పూర్వ పరాలపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధుల నివారణపై జాతీయ స్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డాక్టర్‌ వివేకానంద తెలిపారు.