రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్డీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను మళ్లీ యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ఇవాళ ప్రకటించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట కలుగనుంది. ఇక తాజా ద్రవ్య పరపతి సమీక్ష లో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ నిర్ణయం కారణంగా కీలక రెపో రేట్ స్థిరంగానే కొనసాగింది. రెపో రేట్ 4 శాతం వద్దనే కొనసాగుతోంది. అలాగే రివర్స్ రెపో రేటు 3.5 శాతం ఉండనుంది. వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఈ సంవత్సరం 9.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే.. రిటైల్ ద్రవ్యోల్భణం సీపీఐ 5.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. గత పాలసీ సమీక్ష తో పోలీస్తే.. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడ్డాయని ఆయన చెప్పారు.