ఏపీ కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య నియామకం అయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు సీఎస్ నీరబ్ కుమార్ పీసీబీ చైర్మన్ బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు మాజీ సీఎస్ సమీర్ శర్మ సైతం పీసీబీ చైర్మన్‌గా పని చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు ఆయన అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలో సీఎస్‌గా పని చేస్తున్న నీరబ్ కుమార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.ప్రస్తుతం నీరబ్ స్థానంలో ఆ బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యను ప్రభుత్వం అప్పగించింది. అందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, గత ప్రభుత్వానికి అనుకూలులు అని పేరు తెచ్చుకున్న వారిని చంద్రబాబు ప్రభుత్వం మార్చి వారి స్థానాల్లో వేరే వారికి అవకాశం ఇస్తోంది.