రాజీవ్ విగ్రహం టచ్ చేస్తే..చుక్కలు చూపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆవిష్కరిస్తామని… యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శం అని చెప్పారు. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టమని… రాజీవ్ చిరస్మరణీయుడని కొనియాడారు. విగ్రహం పై అనవసర రాజకీయాలు చేయొద్దని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు.
అనవసర ప్రేలాపనలు వద్దని… రాజీవ్ పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తా.. రాజీవ్ విగ్రహం టచ్ చేసి చూడండని వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ విగ్రహం కూలగొడతం అంటే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. సెక్రటేరియట్ కట్టెప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదన్నారు. మాకు ఎవరి పట్ల వివక్ష లేదని నిప్పులు చెరిగారు. అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులను అందరికి సముచిత గౌరవం ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.