రేవంత్ రెడ్డి మా వల్లే సీఎం అయ్యాడు.. మంత్రి శ్రీధర్ బాబుపై మృతుడు గంగారెడ్డి సోదరి రాధ ఫైర్

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం సొంత పార్టీపైనే జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను పరామర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీకో దండం, మీ పార్టీకో దండం రా.. బాబు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆదేశాలతోనే నిందితుడు గంగారెడ్డిని హత్య చేశాడని జీవన్ రెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలోనే మారు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబుపై మృతుని సోదరి రాధ సీరియస్ అయ్యారు. ‘అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు’. గత గవర్నమెంట్‌లో మంచిగా ఉన్నాం..మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బతుకుతున్నాం’ అంటూ మండిపడ్డారు. ఇప్పుడు మీరొచ్చి పరామర్శిస్తే మా తమ్ముడు బతికొస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మమ్మల్ని భయాందోళనకు గురిచేస్తున్నారని గంగారెడ్డి సోదరి రాధ ఆవేదన వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news