తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు మరియు రేవంత్ రెడ్డికి మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత విద్యుత్ గురించి ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్ళను ఇచ్చుకుంటున్నారు. కాగా రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్కు బహిరంగ సవాలును విసిరారు. రానున్న ఎన్నికలల్లో ప్రచారంలో భాగంగా రైతుల కోసం 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్తు ను ఇస్తున్న గ్రామాలకు మేము వెళ్ళాము ఓట్లు అడగము. ఏఏ గ్రామాలలో అయితే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వడం లేదో అక్కడకి మీ పార్టీ నాయకులూ ఓట్లకు రాకూడదు. ఏఏ కమిట్మెంట్ కు మరియు కండిషన్ కు మీ పార్టీ సిద్ధమా చెప్పండి అంటూ కేసీఆర్ కు సవాలు విసిరారు. కరెంట్ ఇస్తున్నారా లేదా అన్న విషయాన్నీ గ్రామ సభలలో రైతులను అడిగి తెలుసుకుందాం అంటూ రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు అందరికీ సీట్లు ఇస్తానని ఒప్పుకోవాలి అంటూ కండిషన్ పెట్టారు,
మరియు గజవెల్ నుండి పోటీ చేస్తానని కేసీఆర్ మాటివ్వాలని రేవంత్ రెడ్డి బాగా ఇరికించాడు. మరి ఏఏ కండిషన్ లు అంటికీ సీఎం కేసీఆర్ ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.