బ్లడ్‌ గ్రూప్‌లను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు..!!

-

మనుషులంతా చూసేందుకు ఒకే తీరు ఉంటారు కానీ.. వారి గుణగణాలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి.. ఒక్కోక్కరిది ఒక్కో మనస్తత్వం..ఒక్కో స్వభావం. అంచనా వేయడం కూడా మనకు కష్టమైన పని.. కానీ మనుషుల బ్లడ్‌ గ్రూప్‌ను బట్టి.. వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో బ్ల‌డ్ గ్రూప్ వారు ఒక్కో వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటార‌ట‌. జ‌పాన్ వంటి దేశాల్లో ఉద్యోగుల‌ను నియ‌మించుకునేట‌ప్పుడు వారి బ్ల‌డ్ గ్రూప్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ట‌. వేరు వేరు బ్ల‌డ్ గ్రూప్‌ల వారు ఎటువంటి స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారో ఇప్పుచు చూద్దాం..!

ఏ పాజిటివ్ గ్రూప్ ర‌క్తం క‌లిగిన వారు చాలా సున్నిత‌మ‌న‌స్కులై ఉంటారు. ఇత‌రుల మీద ఆధార‌ప‌డ‌కుండా వారి క‌ష్టాన్ని న‌మ్ముకుని ప‌నులు పూర్తి చేస్తారు. అలాగే వీరికి త్యాగ గుణం కూడా ఎక్కువ‌గా ఉంటుందట… చాలా నిజాయితీగా ఉంటారు.

ఎ నెగెటివ్ గ్రూప్ ర‌క్తం క‌లిగిన వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొండిగా ఉంటారు. వారు చెప్పిందే నెగ్గాల‌ని ప‌ట్టుబ‌డ‌తారు. సంప్ర‌దాయ‌ల‌కు విలువ‌నిస్తారు. అలాగే ఈ గ్రూప్ ర‌క్తం క‌లిగిన వారికి చాద‌స్తం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

బి పాజిటివ్ గ్రూప్ ర‌క్తం క‌లిగిన వారు చాలా ఆవేశంగా ఉంటారు. అలాగే వీరు సాహోపేత‌మైన నిర్ణ‌యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటారట. వీరికి ముక్కు మీదే కోపం ఉంటుంది.

బి నెగెటివ్ ర‌క్త స‌మూహం క‌ల‌వారు చాలా స్వార్థంగా ఉంటారు. బాధ్య‌త లేకుండా ఇత‌రుల‌ను కించ‌ప‌రుస్తూ అహంకార పూరిత స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారు.

ఎబి పాజిటివ్ బ్ల‌డ్ గ్రూప్ క‌లిగిన వారు విశిష్ట‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉండి చాలా క‌లుపుగోలుత‌నాన్ని క‌లిగి ఉంటారు. ఎప్పుడూ నిర్మ‌ల మ‌న‌సుతో ప్ర‌శాంతంగా కనిపిస్తారట

ఎబి నెగెటివ్ ర‌క్త స‌మూహం క‌లిగిన వారు చాలా సంక్లిష్ట‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉండి ఒక ప‌ట్టాన ఎవ‌రికీ అర్థం కారట. వీరు ఎప్పుడూ ఒక నిర్ణ‌యంపై నిల‌బ‌డ‌రు. అవ‌స‌రానికి త‌గిన‌ట్టుగా మారుతూ ఉంటారు. ఊసరవెల్లి టైప్‌ అనమాట వీళ్లు..

ఒ పాజిటివ్ గ్రూప్ ర‌క్తం వారు చాలా ఆహ్లాదంగా ఉంటూ ప‌ది మందితో చాలా సులువుగా క‌ల‌సిపోతారు. భ‌విష్య‌త్తుపై ఆశావాహ దృక్ప‌థం క‌లిగి ఉండి చాలా ధైర్యంగా ముందుకు న‌డుస్తారు.

ఒ నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్ క‌లిగిన వారు చాలా అహంకారాన్ని క‌లిగి ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వారిని కించ‌ప‌రుస్తూ వారిపై నింద‌లు వేస్తూ ఉంటారు. విలన్‌ క్యారెక్టర్స్‌.. అలాగే వీరికి గ‌ర్వం, అసూయ కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

ఈ విధంగా వేరు వేరు ర‌క్త స‌మూహాలు క‌లిగిన వారు వేరు వేరు స్వ‌భావాల‌ని క‌లిగి ఉంటార‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు. ఇంతకీ మీ బ్లడ్‌ గ్రూప్‌ ఏంటి..?

Read more RELATED
Recommended to you

Latest news