మామ – అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు: రేవంత్ రెడ్డి

-

మామ, అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఇబ్రహీం పట్నం లో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారని..వాళ్లంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారని అన్నారు. అల్లుడు హరీష్ రావు సమర్థుడు అని కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి ని చేశాడని దుయ్యబట్టారు. ఆయన హయాంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

 

ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభుత్వం గొప్పలు చెబుతోంది కానీ.. కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తాయని అన్నారు. 34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారని.. హైద్రాబాద్ కు కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగిందన్నారు. అయినా ఇన్నిరోజులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. అపోలో లో చాలా మందికి ఐసీయూలో లో చికిత్స అందుతోందన్నారు. ఈ హాస్పిటల్ లో పేషంట్స్ పర్యవేక్షణ కోసం ఒక్క వైద్య శాఖ అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులను ఇక్కడికి తెచ్చి జాయిన్ చేసి వదిలేశారని.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మచి నాణ్యమైన వైద్యం అందితే .. కార్పోరేట్ హాస్పిటల్ కు అందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వీర్యం గా పనిచేస్తున్నాయన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతుందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యతగా తీసుకోనీ చదివించాలన్నారు. కెసిఆర్ బీహార్ పర్యటన చేయడం కాదు .. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలన్నారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వరకు వారికి అండగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version