అమెరికాలో లాంచ్‌ అయిన TCL Tab 10 5G.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

టీసీఎల్ నుంచి కొత్త టాబ్‌ అమెరికాలో లాంచ్‌ అయింది. అదే టీసీఎల్ ట్యాబ్ 10 5జీ. ఇది ఒక బడ్జెట్‌ ట్యాబ్లెట్. 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ట్యాబ్లెట్‌ను కంపెనీ అందించింది. మనదేంలో ఇది ఎప్పుడు లాంచ్‌ అవుతోందో ఇంకా స్పష్టత లేదు.. ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
టీసీఎల్ ట్యాబ్ 10 5జీ ధర..
దీని ధరను 300 డాలర్లుగా అంటే సుమారు రూ.24,000గా నిర్ణయించారు.
అమెరికాలోని టీ-మొబైల్ నెట్‌వర్క్‌లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది.
టీసీఎల్ ట్యాబ్ 10 5జీ స్పెసిఫికేషన్లు..
ఇందులో 10.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.
మీడియాటెక్ కొంపానియో 800టీ 5జీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 8000 ఎంఏహెచ్‌గా ఉంది.
దీని వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఇందులో అందుబాటులో ఉంది.
టీసీఎల్ బ్రాండ్ అమెరికాలో ఈ మధ్యే కొత్త స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేసింది. అదే టీసీఎల్ స్టైలస్ 5జీ. పేరులో ఉన్నట్లు ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ స్టైలస్ ఉండనుంది. ఈ ఫోన్ ధరను అమెరికాలో 258 డాలర్లుగా అంటే సుమారు రూ.20,000గా నిర్ణయించారు. సింగిల్ లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుందో లేదో ఇంకా తెలియరాలేదు.
టీసీఎల్ స్టైలస్ 5జీ స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై టీసీఎల్ స్టైలస్ 5జీ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version