బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం అలానే అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు పై విచారానికి ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెల్లింపులు చేసిన ఖర్చుల వివరాల కోసం విచారణ తప్పనిసరి జరిపిస్తామని అన్నారు. తెలంగాణ నూతన సచివాలయం 28 ఎకరాల విశాల స్థలంలో నిర్మించబడిందని చెప్పారు. ఇంత ఎత్తయిన సచివాలయం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు.
29 అడుగుల వెడల్పు 24 అడుగుల ఎత్తును నాలుగు తలుపులతో బాహుబలి మహా ద్వారాము ని ఏర్పాటు చేశారు అని అన్నారు. అయితే ఈ కట్టడాలు అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విచారణకి ఆదేశిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలని సచివాలయం అంబేడ్కర్ విగ్రహం కోసం ఖర్చు చేసే విషయం తెలిసిందే. పక్కనే ఉన్న కొత్త తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని బీఆర్ఎస్ 179 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది.