ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారు.. అమిత్‌ షాకు ఫిర్యాదు చేస్తా : రేవంత్ వార్నింగ్‌

-

జూబ్లిహిల్స్ తన నివాసం నుంచి ఇందిరాపార్క్ దర్నా చౌక్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సూచలనలతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ అందోళనలను అడ్డుకుంటోందన్న రేవంత్.. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తోన్న కొందరు అధికారులు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఐజీ ప్రభాకరరావు ఖాసిం రిజ్వీ మాదిరి వ్యవహరిస్తున్నారని.. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకరరావుకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ నేతల సహా‌.. రాష్ట్రంలోని ముఖ్య నాయకల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చూపిస్తోందని.. హ్యాకర్లను ఉపయోగిస్తూ.. అంతర్జాతీయ నేరానికి పాల్పడుతోన్న కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు రేవంత్‌. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఐజీ ప్రభాకరరావుపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించేవరకు కాంగ్రెస్ పోరాటం‌ కొనసాగుతుందని… చలో రాజ్ భవన్ కు ఖచ్చితంగా వెళ్ళి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version