తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోట వారికి అన్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ కు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఇంకా ఎందుకు నిర్ణయించలేదని నిలదీశారు.
దీని ద్వారా 15 వేల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తాజా తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు నిర్ణయించాల్సిన బాధ్యత కేసిఆర్ ప్రభుత్వం పై ఉందని స్పష్టం చేశారు. లేకపోతే అభ్యర్థులకు అండగా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం దిగి రాకపోతే, రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.