మల్కాజిగిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లకు చిరాగ్గా మారాయి. రేవంత్ రెడ్డి కి ఉన్న క్రేజ్ కాంగ్రెస్ లోఎవరికీ లేదని ఆయన అభిమానులు ఇతర సీనియర్ నేతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికర పరిణామం.
ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్ నేతలు ఆయనను పార్టీ నుంచి తప్పించాలని ఆయన వల్ల నష్టమే గాని లాభం ఎక్కడా లేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఏ స్థాయిలో విమర్శలు చేసినా అవి ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని ఆయన ఫాలోయింగ్ కేవలం అభిమానమే కానీ ఓటు బ్యాంకు కాదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ విషయాన్ని ఆమెకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనితో రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఈ విషయాన్ని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి పార్టీ నుంచి తప్పు తప్పుకునే భావన లో ఉన్నారట. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని ఉగాది తర్వాత లేదా ఏప్రిల్ మొదటివారంలో ఆయన పార్టీ మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు.