‘జగన్ మైండ్ గేమ్ లో నన్ను మించిపోయాడు’ సన్నిహితుల దగ్గర వాపోయిన చంద్రబాబు ?

-

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ మైండ్ గేమ్ కి రాజకీయ ఎత్తుగడలు వేయలేకపోతున్నారు అని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. మామూలుగా అయితే తెలుగు రాజకీయాలలో మైండ్ గేమ్ ప్లే చేయటం లో చంద్రబాబుని మించిన వారు మరొకరు ఉండరని చాలామంది అంటుంటారు. అయితే ప్రస్తుతం జనరేషన్ మారటంతో చంద్రబాబు చేస్తున్న మైండ్ గేమ్ అన్ని కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వటం తో పాటుగా ఎల్లో మీడియా బండారం కూడా బయట పడిపోతుంది అనే టాక్ బలంగా నడుస్తోంది.Image result for chandrababu jaganముఖ్యంగా సోషల్ మీడియా రావటంతో ఎల్లో మీడియా చంద్రబాబుని ఎంత మోసిన గాని ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందన చంద్రబాబుపై కలగటంలేదు అన్నది స్పష్టం. ఇదే టైమ్ లో జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా పార్టీ లోకి రావడంతో చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ కట్టడి చేసినట్లయింది. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ అంశంలో కావాలని జగన్ మైండ్ గేమ్ ప్లే చేశారని తాజాగా ఇటీవల చంద్రబాబు తన సన్నిహితుల దగ్గర అన్నారట.

 

ఆ ట్రాప్ లో నేను అనవసరంగా పడ్డాను, బీసీల ముందు ద్రోహి అయ్యాను…జగన్ తన పార్టీ తరఫున పది శాతం రిజర్వేషన్ ఇచ్చి హీరో అయ్యాడు అంటూ చంద్రబాబు తన సన్నిహితుల దగ్గర తెగ బాధపడ్డారట. మొత్తంమీద చూసుకుంటే గత సార్వత్రిక ఎన్నికలలో గట్టి దెబ్బ తగలడంతో వయసు మీద పడటంతో ప్రస్తుతం రాజకీయాలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు అని చాలామంది అంటున్నారు. ఇదే తరుణంలో వైఎస్ జగన్ మంచి వయసులో ఉండటం తో జగన్ రాజకీయ వ్యూహాలకు చంద్రబాబు అడ్డంగా దొరికిపోతున్నారు అంటూ మరి కొంతమంది అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news