ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఉద్యోగుల బిల్లుల కోసం కేటాయించిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
అయితే, బిల్లుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు,పదవీ విరమణ పొందిన ఉద్యోగులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు.దీంతో రేవంత్ సర్కార్ నిర్ణయం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు రూ.1000 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని, మిగతావి సంక్షేమ పథకాలకు వాడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఇప్పట్లో బిల్లులు రావని తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.