రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి: రచ్చ ముదిరింది!

-

ఎక్కడైనా రాజకీయాల్లో నాయకులు…తమ ప్రత్యర్ధులపై మాటలతో విరుచుకుపడుతుంటారు…ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తారు. రాజకీయంగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలని చూస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వెరైటీగా ఉంటుంది…సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా సొంత పార్టీ నేతలే ఒకరినొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే రాజకీయం నడుస్తోంది.

ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్తితి ఉంది. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. రేవంత్‌కు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే ఎప్పటికప్పుడు ఏదొక రచ్చ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడానికి కారణం రేవంత్ అన్నట్లు మాట్లాడారు. మళ్ళీ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఏ విషయం కూడా బహిరంగంగా మాట్లాడనని అన్నారు.

కానీ జగ్గారెడ్డి వర్షన్ మారలేదు. ఇటీవల రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి తనని పిలవలేదని చెప్పి జగ్గారెడ్డి….రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. రేవంత్‌ని పి‌సి‌సి నుంచి తప్పించాలని లేదా ఆయన తీరుని మార్చాలని కోరారు.

దీనిపై పి‌సి‌సి కమిటీ సీరియస్ అయింది..ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు అని, కానీ రాసిన లేఖ ఎలా బహిర్గతమైందని ఫైర్ అయింది. జగ్గారెడ్డి క్రమశిక్షణ సంఘం ముందుకు రావాల్సిందే అని చిన్నారెడ్డి మాట్లాడారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జినైన తనకు, తాజాగా భూపాలపల్లి రచ్చబండ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి వెళుతున్నట్లుగా సమాచారం ఇవ్వలేదని, ఆ వార్త తాను మీడియాలోనే చూశానని, ఇది క్రమశిక్షణ చర్యల కిందకు రాదా? క్రమశిక్షణ పాటించని పీసీసీ అధ్యక్షుడిని క్రమశిక్షణలోకి తీసుకురావాలని చిన్నారెడ్డికి తెలియదా?’’ అంటూ ప్రశ్నించారు.

దీంతో కమిటీ ముందుకు మొదట రేవంత్‌రెడ్డిని పిలిచి.. ఆ తర్వాతే తనను పిలవాలని, అప్పుడు తాను తప్పకుండా హాజరవుతానన్నారు. ఇలా రేవంత్‌పై జగ్గారెడ్డి ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్ప..పావలా ఉపయోగం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version