వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బాబా మస్టర్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా బాబా మాస్టర్ ఎంట్రీని ఆహ్వానించారు. ఇక బాబా మాస్టర్ తనదైన శైలి పంచులు, డ్యాన్సులతో కంటెస్టెంట్స్ లో ఉత్సాహం నింపారు.
బిగ్ బాస్ గేమ్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో గేమ్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఇవ్వబోయే టాస్కుల గురించి ఆలోచిస్తూనే, ఇంటి సభ్యులతో ఎత్తులు పై ఎత్తుల గురించి చర్చించుకుంటున్నారు. ఇక బాబా మస్టర్ హౌజ్ ఎంట్రీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎయ్ రా మాస్..అనే సాంగ్ తో ఊర ‘మాస్’గా కుదిరింది.
తన స్టెప్పులతో కంటెస్టెంట్స్ తో పాటు బీబీ లవర్స్ లో హుషారు నింపారు బాబా మాస్టర్. అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాబా మాస్టర్ ఒక్కొక్కరికి సలహాలు, సూచనలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ కు బాబా మాస్టర్ ఇచ్చిన సలహాలు వెరీ జెన్యూన్ గా ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
‘పెనంతో పెళ్లాంతో పెట్టుకోకూడదు.. పెనం వేడెక్కితే దోశ మాడిపోతది..పెళ్లాం అలిగితే అట్లనే మనకు లాస్ అయితది’ అనే డైలాగ్ తో బాబా మాస్టర్ అదరగొట్టేశాడు. కోపం తగ్గించుకోవాలని నటరాజ్ మాస్టర్ కు సూచన ఇచ్చాడు. శివతో మంచిగా ఉండాలని చెప్పాడు.ఎనిమిదో వరకు నటరాజ్ మాస్టర్ కొనసాగాడంటే కోపం తగ్గించుకున్నాడనే చెప్పొచ్చని బీబీ లవర్స్ అంటున్నారు. చూడాలి మరి.. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నటరాజ్ మాస్టర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..