హ‌మారా స‌ఫ‌ర్ : ఇలా చేస్తే విజ‌న్ 2024లోనూ ఆయ‌నే టాప్ !

-

త‌ప్పులు దిద్దుకోవ‌డంతోనే నేత‌లు ఎదుగుతారు. త‌ప్పులు దిద్దుకోలేక పోతే నాయ‌కులు చ‌తికిల‌ప‌డ‌తారు. త‌ప్పులెన్ను వారు త‌మ త‌ప్పులు ఎరుగ‌రు అని ఓ శ‌త‌క‌కారుడు చెప్పారు. అవును! త‌ప్పులు ఎన్ని ఉన్నా కూడా వాటిని దిద్దుకోకుండా ముందున్న కాలంలో అంతా మంచే జ‌రుగుతుంది అని భావించ‌డంలో అర్థం లేదు. ఔన్న‌త్య‌మూ లేదు. కాలాన్ని వృథా చేసి, ఉన్న స‌మ‌యంలో ఎవ్వ‌రికీ ఏ ఉప‌యోగం లేకుండా ఉండ‌డంలోనే సిస‌లు త‌ప్పు దాగి ఉంది. కాలాన్ని వృథా చేసి, ఉన్న స‌మ‌యంలో ఎవ‌రి ఉన్న‌తికీ కార‌ణం కాకుండా ఉండ‌డంలో ఏ ఉప‌యోగం లేదు అన్న‌ది నిజం. ఈ నిజాన్ని అంగీక‌రించ‌కుండా నాయ‌కులు ఎద‌గ‌లేరు. త‌మ వారి ఉన్న‌తికి కృషి చేయ‌నూ లేరు. సహ‌కారం అందించ‌నూ లేరు. అందుకే ! ఎవ్వ‌రైనా స‌మ‌య పాల‌న పాటించాలి.. క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాలి..ఇవే క‌ర్త‌వ్య దీక్ష‌కు ప్రామాణికాలు అవుతాయి.

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇవాళ పుట్ట్రినోజు జ‌రుపుకుంటున్నారు. ఆయ‌న‌కు ఇది 72 వ పుట్టిన్రోజు. ఓ నేత‌గా ఆయన ఎన్నో సాధించారు. అధినేత‌గా ఆయ‌న ఎన్నో సాధించాల్సి ఉంది. ఇక్క‌డే ఆయ‌న త‌డ‌బ‌డుతున్నారు. ఒక‌ప్పుడు పార్టీపై ఆయ‌నకు మంచి క‌మాండ్ ఉండేది. ఆయ‌న చెప్పిన మాటను దాటిన వారు లేరు. ఆయ‌న గీసిన గీత‌ను దాటిన వారు కూడా లేరు. పార్టీలో ఆయ‌న ప్ర‌మేయం లేకుండా ఏ నిర్ణ‌యం అమ‌లు అయ్యేది కాదు.  ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే అంతా ఉండేవారు. ఉమ్మ‌డి ఆంధ్రాలో అధికారుల‌ను ప‌రుగులు తీయించిన ఘ‌ట‌న‌లు కానీ సంద‌ర్భాలు కానీ ఎన్నో! ఆ రోజు స్వ‌ర్ణాంధ్ర సాధ‌నే త‌న ధ్యేయమ‌ని ప‌నిచేశారు. ప‌రిశ్ర‌మించారు అని రాయాలి. శ‌క్తి వంచ‌న లేకుండా  ప‌నిచేసి ఫ‌లితాలు రాబట్టారు ఆ రోజు సీఎం హోదాలో కానీ ఇప్పుడు కాస్త అధినేత హోదాలో వెన‌క‌బ‌డిపోతున్నారు. ఎందుక‌ని?

నో డౌట్.. తెలుగుదేశం పార్టీకి మంచి కార్య‌వ‌ర్గం ఉంది. కార్య‌క‌ర్త‌లూ ఉన్నారు. అవ‌శేషాంధ్ర‌లోనూ ఆ పార్టీ బ‌లంగానే ప‌నిచేసింది.
ఐదేళ్లు అధికారంలో ఉండి మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దింది. పాల‌న విష‌యంలో ఎన్నో మంచి నిర్ణ‌యాలు తీసుకుంది. కొన్ని త‌ప్పిదాల కార‌ణంగా బాబు వెనుక‌బ‌డ్డారు.ముఖ్యంగా కొంద‌రు నాయ‌కుల‌ను ఆయ‌న త‌ప్పించాలి. భ‌జ‌న ప‌రుల‌ను త‌ప్పించాలి. అదేవిధంగా జిల్లాలలో యువ నాయ‌క‌త్వాల‌ను ఇంకా ప్రోత్స‌హించి, వారికి మంచి స్థానం క‌ల్పించాలి. ప‌దవుల కోసం కాకుండా పార్టీ కోసం  ప‌నిచేసే వారికే అంద‌లం ద‌క్కేలా చూడాలి. టిక్కెట్ల కేటాయింపులో ఆయ‌న మొహ‌మాటాల‌కు పోకూడదు. ఆయ‌న‌లో
ఓ చిన్న‌పాటి క‌న్ ఫ్యూజ‌న్ కూడా ఉంది అని అంటారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. అది కూడా పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవాలి. నో డౌట్ ..ఆయ‌న మంచి నాయ‌కులు.. అంత‌కుమించి గ‌తం క‌న్నా మించి స‌మ‌ర్థ నాయ‌కులు అని అనిపించుకుని తీరాలి. ఇంకా లోకేశ్ కు ప‌రిణితి రాలేదు క‌నుక ప్ర‌స్తుతానికి పార్టీని లీడ్ చేసేది చేయాల్సిందే చంద్ర‌బాబే !
డియ‌ర్ స‌ర్ ఆల్ ద బెస్ట్ .

Read more RELATED
Recommended to you

Exit mobile version