మూడు భాగాలుగా ఆర్జీవీ బ‌యోపిక్‌..

-

సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బ‌యోపిక్ రాబోతోంది. మూడు భాగాలుగా బ‌యోపిక్ రానుంది. రామ్‌గోపాల్‌ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బొమ్మాకు క్రియేషన్స్‌ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. ఇందులో మొదటి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయ‌బోతున్నారు.

ఈ సందర్భంగా బొమ్మాకు మురళి మాట్లాడుతూ.. *రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించనున్నాం. ఒక్కొక్క భాగం 2 గంటలుంటుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నారు. రెండో భాగంలో వేరే నటుడు, ఇక మూడో భాగంలో ఆర్జీవీ పాత్రలో స్వయంగా ఆర్జీవీయే నటించబోతుండటం విశేషం* అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version