తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఉండగా సభ ఇంత పేలవంగా ఉండడం ఇదే మొదటిసారి అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కూడా మైక్ సౌండ్ సైతం సరిగా రాకపోవడం చాలా బాదాకరం అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ లేదా కార్యక్రమ నిర్వాహకులు పట్టించుకోలేదు అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కన్నా కూడా బర్రెలక్క చాలా మేలంటూ చెప్పడం చాలా ఆశ్చర్యం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
ఎప్పుడూ పవన్ ను విమర్శించే రామ్ గోపాల్ వర్మ ఇలాగే మాట్లాడుతాడు అంటూ తీసిపారేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలలో బీజేపీ గెలుస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.