RGV Ladki : చైనా ఫిలిం ఫెస్ట్ లో ఆర్జీవీ ల‌డ‌కీ!

-

RGV Ladki :రామ్ గోపాల్ వర్మ .. ఏ సినిమా తీసినా సెన్సేషన్లే. త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తూ..త‌న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌పోతాడు. ఆయ‌న సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఏ మాత్రం లెక్క చేయ‌దు. తాను చెప్పాల‌నుకున్న‌దే చెప్పాడు. తాజాగా త‌న అభిమాన న‌టుడు బ్రూస్లీకి కనెక్ట్ అయ్యేలా ఒక్క సినిమా అయినా తీశాడు. ఈ చిత్రానికి ల‌డ‌కీ అనే పేరు పెట్టాడు.

ఈ చిత్రంలో పూజ భలేకర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాని ఆర్జీవీ దర్శకత్వంలో ఆర్ట్ సి మీడియా – చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇండో – చైనీస్ కాంబినేషన్ లో రూపొందించిన ‘లడకీ’ సినిమాని డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళం, హిందీ, చైనీస్ భాషలోరిలీజ్ అవుతుంది. చైనాలో ఈ చిత్రాన్ని ‘డ్రాగన్ గర్ల్’ అనే పేరుతో రిలీజ్ అవ్వనుంది.

అంతే కాక బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో నవంబర్ 27న ‘లడకీ’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఇండో-చైనీస్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కి సెలెక్ట్ అయింది. చైనాలో జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ‘లడకీ’ సినిమా త్వరలో ప్రదర్శించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news