RRR : నాటు.. నాటు సాంగ్ రిలీజ్..ఇరగదీసిన చెర్రీ, తారక్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా త్రిపుల్ ఆర్. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ ఈ త్రిపుల్ ఆర్ సినిమా ను టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ అయిన నాటు నాటు అనే సాంగ్ ను విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌. ఈ సాంగ్ లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చాలా ఎనర్జీ గా కనిపించారు. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ఎవరూ ఏ మాత్రం తగ్గ కుండా స్టెప్పులు ఇరగదీశారు. రోమాలు నిక్కపొడిచేలా ఇద్దరు డాన్స్ ఇరగదీశారు.  అలాగే.. లిరిక్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సాంగ్ తో ఎన్టీఆర్, చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news