టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి రోజూ ఏదో ఒక దానిపై కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు వర్మ. ముఖ్యంగా… ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తూ… ట్విట్టర్ లో కౌంటర్ పేల్చుతూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.
అయితే.. తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు వర్మ… ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై ప్రశంసలు కురిపించారు. మీరు 32 ఏళ్ల కే పరిశ్రమలు, ఐటీ శాఖలకు మంత్రి అయ్యారు. 32 ఏళ్లకే మంత్రి పదవి సాధిస్తే.. 82 ఏళ్లకు ఎలాంటి పదవులు అధిరోహిస్తారో నేను ఊహించలేకపోతున్నాను. అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
అయితే.. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు మంత్రి గుడివాడ అమర్ నాధ్ కు తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. నా నాయకుడు జగన్ యువకులకు అవకాశం ఇస్తే.. పెట్టుబడులు తెస్తారని భావించి ఉంటారు. ఇలాంటి ధైర్యవంతమైన అడుగు వేసినందుకు సీఎం జగన్ కు రుణపడి ఉంటా” అని ట్వీట్ చేశారు.
Thank you @RGVzoomin Sir. Perhaps my leader feels young legs and tireless pursuit are needed to secure global investments. My gratitude to Sri @ysjagan for his extraordinary vision and courage in taking this step. #TimetoGiveBack #TimetoBuild https://t.co/jItMz08dF5
— Gudivada Amarnath (@gudivadaamar) April 14, 2022