తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. తీవ్ర ఎండకు విలవిల లాడుతున్న తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రాములో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గాలి వేగం గంటకు 30 నుండి40 కి మీ వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని…. దాని నుండి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదే విధంగా రేపటి నుండి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.