ఇండియా హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్ ?

-

మరో నాలుగు రోజుల్లో ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ రేసులో కొత్త పేర్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయిఇప్పటికే స్టీఫెన్ ప్లెమింగ్, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్,జస్టిన్ లాంగర్.. ఇలా లిస్ట్‌ చాలా ఉంది. తాజాగా ఆసీస్‌ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్ రికీ పాంటింగ్‌ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక దీనిపై రికీ పాంటింగ్ స్పందించారు.ఈసారి’ నేను అప్లై చేయడం లేదంటూ కారణం ఏంటనేది కూడా వెల్లడించాడు.

”భారత ప్రధాన కోచ్‌ పదవి అత్యంత క్లిష్టమైందని ,బాధ్యతలు చేపట్టిన వ్యక్తిపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే, నేను ఇప్పుడు ఈ స్థానంలో పని చేసేందుకు సిద్ధంగా లేను. తప్పకుండా భవిష్యత్తులో దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోలేదు. సీనియర్ జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం అత్యంత గౌరవంగా భావిస్తా. కానీ, ఈసారి మాత్రం అలాంటి అవకాశం లేదు. వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమైందే. కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సి ఉంది. ఇక ఇండియా కోచ్‌గా దాదాపు 10 నెలలపాటు విధుల్లోనే ఉండాలి. ఐపీఎల్‌తో సంబంధం ఉండకూడదు.

ఇప్పుడు నా జీవన శైలికి అది సరిపడదు అని అన్నారు.అయితే, నా కుమారుడు మాత్రం ఈ అవకాశం వస్తే వదులుకోవద్దని సూచించాడు. ఇప్పుడు మాత్రం దానికి సరిపోయేలా జీవనశైలి లేదని కచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి” అని పాంటింగ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news