రైతంగాన్ని నిలువునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: హరీష్ రావు

-

ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని , రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సన్నాహక సమావేశం ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇల్లు, పింఛన్, అమలు చేయడాన్ని విస్మరించిందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు హరీష్ రావు .

పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్‌లో లాఠీఛార్జి చేయడం సిగ్గుచేటన్నారు. వడ్లకు బోనస్ ఎగ్గొట్టిన కాంగ్రెస్‌కు రైతు బిడ్డలు బుద్ధి చెప్పాలన్నారు. కరెంట్, రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల ధరలు పెంచే యోచన రేవంత్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్‌ను బలపర్చాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news