ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా రిషబ్ పంత్

-

ఎంఎస్ ధోనీ వారసుడిగా భారత జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. ఉత్తరాఖండ్ లోని రూర్కి లో 1997 అక్టోబర్ 4న జన్మించిన రిషబ్ పంత్ ఎన్నో ఆటుపోట్లను దాటుకొని ఈరోజు భారత క్రికెట్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా రిషబ్ పంత్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా పంత్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ట్విటర్ వేదికగా వెల్లడించారు.

” దేవభూమి సుపుత్రుడు, ప్రతిభావంతుడైన రిషబ్ అనతి ను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యువతను క్రీడలు, ప్రజారోగ్యం విషయంలో ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం”. అని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో దిగిన ఫోటోలను పంత్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. తనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామికి రిషబ్ పంత్ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news