‘సీతారామం’ వంటి క్లాసికల్ లవ్ స్టోరితో హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. చక్కటి సినిమా తీసిన దర్శకుడు హను రాఘవపూడిని సినీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ కూడా అభినందిస్తున్నారు. పలు సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేసిన హను రాఘవపూడి ..దర్శకుడిగా ఈ సినిమాను చాలా చక్కగా తీశారని కొనియాడుతున్నారు.
క్లాసిక్ లవ్ స్టోరి ‘సీతారామం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ను పరిచయం చేశారు దర్శకుడు హను. అయితే, హను.. ఈ ఒక్క హీరోయిన్ నే కాదు ఇంకా కొంత మంది హీరోయిన్లను తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా దర్శకుడిగా చక్కటి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమా ద్వారా లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా పరిచయం చేసిన హను.. తన తర్వాత చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ద్వారా బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా కౌర్ ను పరిచయం చేశారు. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది.
ఇక ఆ తర్వాత హను రాఘవపూడి.. యూత్ స్టార్ నితిన్ తో ‘లై’ సినిమా చేశాడు.
ఈ సినిమా ద్వారా మేఘ ఆకాశ్ ను తెలుగు వారికి హీరోయిన్ గా పరిచేయం చేసిన హను రాఘవపూడి.. ‘సీతా రామం’ ద్వారా మృణాళ్ ను తెలుగు వారికి పరిచయం చేశారు.
‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో కథానాయికగా అప్పటికే తెలుగువారికే పరిచయమై సాయిపల్లవి నటించింది. దర్శకుడు హను రాఘవపూడి ..కథకుడిగా, కథా రచయితగా ఇండస్ట్రీ వెరీ డిఫరెంట్ ప్లస్ యూనిక్ స్టైల్ కలిగి ఉన్నాడని ‘సీతారామం’ సినిమా చూసిన సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన నెక్స్ట్ ఫిల్మ్ కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.