ఐపీఎల్ 2021 : ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్

ఐపీఎల్ 2021 లో మిగిలిన మ్యాచులకు కెప్టెన్ ను ఖరారు చేసింది దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ. ఈ టోర్నీ లో మిగిలిన మ్యాచులకు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కెప్టెన్ గా కొనసాగుతారని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఐపీఎల్ 2021 మొదటి సీజన్ లో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు గాయం కావడంతో తప్పుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా నియామకం చేసింది ఫ్రాంచైజ్.

rishab panth
rishab panth

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించాడు. ఇక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్… గాయం నుంచి కోలుకున్నాడు. అయితే అయ్యర్ గాయంతో కోల్పోవడంతో… అతడే ఢిల్లీ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా.. రిషబ్ పంత్ మళ్లీ కొనసాగుతానని స్పష్టం చేసింది ఫ్రాంచైజీ. కాగా సెప్టెంబర్ 19న.. ఐపీఎల్ 2021 పునర్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది.