భారత్ తో మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తూ రిజ్వాన్ గాయపడ్డాడు. తనకంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అందుకునే క్రమంలో రిజ్వాన్ కు గాయమైంది. బంతి కోసం పైకి ఎగిరి కింద పడేటప్పుడు రిజ్వాన్ కాలు నిటారుగా భూమికి బలంగా తాకింది. దీంతో అతడు అక్కడే కింద పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. రిజ్వాన్ గాయపడటంతో టీము ఫిజియోలు వచ్చి గ్రౌండ్ లోనే అతడికి ప్రాథమిక వైద్యం అందించారు.
నొప్పి వేధిస్తున్న రిజ్వాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు రిజ్వాన్ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డ పోరాటం మాత్రం ఆపలేదు. అయితే మ్యాచ్ ముగిశాక రిజ్వాన్ ను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తున్నది. రిజ్వాన్ గాయం తీవ్రత ఎక్కువే అని అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయించిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి రాబోయే మ్యాచ్ లలో రిజ్వాన్ ను ఆడించాల? లేదా? అనేది పాకిస్తాన్ జట్టు.