పవన్ పర్యటన కోసం రోడ్ బ్లాక్.. అంబులెన్స్‌లో రోగి పరిస్థితి విషమం!

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరు పర్యటనలో ఉన్నారు. అటవీ శాఖ అమరుల సంస్మరణ సభకు హాజరవ్వగా.. ఇందుకోసం పోలీసులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో చిలకలూరిపేట నుంచి హాస్పిటల్ కోసం వచ్చినటువంటి రోగిని తరలిస్తున్న అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. దీంతో రోగి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా మారినట్లు సమాచారం.

శ్వాస సంబంధిత ఇబ్బందితో రోగి బాధపడుతున్నట్లు చెప్పిన బాధితులు వెల్లడించారు.శ్వాస అందక సీపీఆర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోయిందని అంబులెన్స్ సిబ్బంది నిర్దారించారు.దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల ఏర్పాట్ల తీరుపై సామాన్యలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంబులెన్సును పంపించకుండా ట్రాఫిక్ బ్లాక్ చేయడం ఏమిటని పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news