ఇంట్లోనే పుట్టిన రోజు చేసుకుంటున్న రోహిత్…!

-

లాక్ డౌన్ తో ఏదైనా వేడుకలు ఉన్నా సరే అందరూ కూడా ఇంట్లోనే సైలేట్ గా జరుపుకుంటున్నారు. గ్రాండ్ గా జరగాల్సిన పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ఇళ్ళకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ పుట్టిన రోజు వేడుకలు కూడా ఇంట్లోనే జరుగుతున్నాయి. గత ఏడాది ఐపిఎల్ లో ఆడిన రోహిత్ తన ముంబై టీం తో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు.

ఇప్పుడు ప్రశాంతంగా తన భార్య రితికా సజ్దేహ్ మరియు కుమార్తె సమైరాతో కలిసి చేసుకుంటున్నాడు. గత ఏడాది వీళ్ళు పుట్టిన రోజుని ఫ్రాన్స్ లో చేసుకోవాలని ప్లాన్ చేసారట. ఐపిఎల్ ఉన్నా సరే విదేశాల్లో చేసుకోవాలని ప్లాన్ చేసినా సరే… ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. దీనితో ఇంటికే పరిమితం అయ్యాడు రోహిత్. తన కూతురు తో కలిసి ఒక ఫోటో ని పోస్ట్ చేసాడు.

2013 నుంచి టీం ఇండియా ఓపెనర్ గా మారిన రోహిత్ అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయాడు. మూడు ఫార్మాట్స్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు రోహిత్. మోడరన్ డే గ్రేట్స్ లో ఒకడిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రోహిత్. వన్డే క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం తన పుట్టిన రోజు వేడుకలను ఏ హడావుడి లేకుండా చేసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news