వామ్మో ఎన్ని విమానాలు పార్క్ చేసి ఉన్నాయో చూడండి…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు విమానం ఎగరాలి అంటే చాలు భయపడే పరిస్థితి. ఎక్కడ కరోనా వస్తుందో అనే భయం తో ఒక్క విమానం కూడా ఎగిరే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమానాలు పార్కింగ్ ప్లేస్ లోనే ఉండిపోయాయి. తాజాగా ఒక విమానాలు పార్క్ చేసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అమెరికాలోని విమానాశ్రయంలోనిది ఈ వీడియో.

కాలిఫోర్నియాలోని విక్టర్‌విల్లేలోని ఒక విమానాశ్రయంలో రన్‌వేపై ఆపి ఉంచిన వందలాది విమానాలకు సంబంధించిన వీడియో ఇది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలు విధించడం తో విమానాలు అన్నీ ఎక్కడివి అక్కడ ఆపేశారు. ఒక విమాన పైలెట్ దీని మొత్తాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పంచుకున్నాడు. ఈ క్లిప్ అంతా కూడా గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉంటుంది. బ్రయాన్ కీత్ అనే పైలెట్ తన గ్రుమ్మన్ టైగర్ విమానంలో సదరన్ కాలిఫోర్నియా లాజిస్టిక్స్ విమానాశ్రయం మీదుగా ఈ వీడియో ని రికార్డ్ చేసాడు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) విభాగంతో సమన్వయంతో చిత్రీకరించబడిన ఈ వీడియోలో, 400 కి పైగా ఖాళీ విమానాలు ఒకదాని పక్కన ఒకటి ఆపి ఉంచినట్లు ఉంటుంది. రన్ వే పై భారీగా విమానాలను ఆపేశారు. అక్కడ ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన విమానాలు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించాడు. “విక్టర్విల్లే కాలిఫోర్నియా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద విమాన పార్కింగ్ ప్రదేశాలలో ఒకటి” పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news